కోసిగి పట్టణంలోని 3వ వార్డు మెంబర్ పెద్ద అంపమ్మ మంగళవారం మృతిచెందారు. ఈ సందర్భంగా మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి సోదరులు, మంత్రాలయం సొసైటీ చైర్మన్ ఎన్. రామకృష్ణ రెడ్డి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పిన రెడ్డి, క్లిష్ట సమయంలో పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని, కుటుంబానికి పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.