నందవరం రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి, వైసీపీ నేత నివాళులు

8చూసినవారు
నందవరం రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి, వైసీపీ నేత నివాళులు
శనివారం ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని నందవరం మండలం హాలహర్వి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో చిలకలడోణ గ్రామానికి చెందిన బోయ పాలజోన్నల లక్ష్మి మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వై. ప్రదీపకుమార్ రెడ్డి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మృతురాలి కుటుంబానికి ఆర్థికసాయం అందించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్