గురువారం పెద్దకడబూరు మండలంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో "వెన్నుపోటుకు రెండేళ్లు" పేరుతో నిరసన కార్యక్రమం జరిగింది.
టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో విఫలమైందని ఆరోపిస్తూ ఈ ఆందోళన చేపట్టారు. మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు వై. ప్రదీప్ రెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు పురుషోత్తం రెడ్డి, నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పార్టీ నాయకులు తెలిపారు.