నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండలం నెహ్రూనగర్ లోని శ్రీశైలం బ్యాక్‌వాటర్ గోకరాజు కుంట వద్ద బుధవారం ఎమ్మెల్యే గిత్త జయసూర్య 62 లక్షల చేప పిల్లలను విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకార సంఘాలకు ఉచితంగా చేప పిల్లలను అందించడం ద్వారా చెరువుల్లో చేపల ఉత్పత్తి, ఉత్పాదకత పెరుగుతుందని, తద్వారా మత్స్యకారుల కుటుంబాల జీవనోపాధి మెరుగుపడుతుందని, మత్స్య పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు.