నంద్యాల పట్టణంలోని శ్రీరామకృష్ణ డిగ్రీ, పీజీ (అటానమస్) కళాశాలలో శుక్రవారం మెగా ప్లేస్‌మెంట్ డ్రైవ్ నిర్వహించబడింది. ఎంపీ బైరెడ్డి శబరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, విద్యార్థులకు డిగ్రీతో పాటు సాంకేతిక, కమ్యూనికేషన్ నైపుణ్యాల ఆవశ్యకతను వివరించారు. ఈ ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో 16 ప్రముఖ సంస్థలు పాల్గొని, విద్యార్థుల ఎంపిక ప్రక్రియను చేపట్టాయి.