శ్రీశైలం ముంపు బాధితులకు జీవో 98 ప్రకారం
ఉద్యోగాలు కల్పించాలని రాయలసీమ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కుంచం వెంకట సుబ్బారెడ్డి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని కోరారు. అమరావతిలో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. నందికొట్కూరులో బాధితుల దీక్షలు 69వ రోజుకు చేరాయని, న్యాయం చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.