చాగలమర్రి మండలంలో కేసీ డిస్ట్రిబ్యూటరీ వంటకాలువ గురువారం గొట్లూరు వద్ద కోతకు గురై పెద్ద గండి పడింది. దీంతో కాలువ నీరు ఒక్కసారిగా పొలాల్లోకి చేరి సుమారు 150 ఎకరాల్లో ఉన్న పంటలు నీటమునిగాయి. వివిధ రకాల పంటలు నాశనం కావడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.