నంద్యాల శ్రీనివాస్ సెంటర్‌లోని మాజీ సీఎం వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా డీసీసీ అధ్యక్షుడు స్వామి డిమాండ్ చేశారు. ఈ ఘటన వెనుక రాజకీయ కుట్ర కోణం ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. నిందితుడి కాల్ రికార్డులను పరిశీలించాలని ఆయన కోరారు. పట్టపగలు విగ్రహంపై దాడి జరుగుతుంటే పోలీసులు అడ్డుకోకపోవడం హేయమైన చర్య అని స్వామి విమర్శించారు.