డోన్: మాజీ మంత్రి బుగ్గన అరటిచేను రైతుల పక్షాన పాదయాత్ర

3చూసినవారు
డోన్: మాజీ మంత్రి బుగ్గన అరటిచేను రైతుల పక్షాన పాదయాత్ర
అరటిపంటకు సరైన మద్దతు ధర లభించక నష్టపోతున్న అన్నదాతలను ఆదుకోవాలని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్యాపిలి మండలంలో మంగళవారం పాదయాత్ర చేపట్టారు. హుసేనాపురం నుంచి డి. రంగాపురం వరకు సాగిన ఈ యాత్రలో రైతులు తమ పంటకు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఎగుమతులు తగ్గడంతో మార్కెట్ ధరలు పడిపోవడంపై ఆవేదన వ్యక్తం చేసిన రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బుగ్గన డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్