ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలి: షేక్షావలి

975చూసినవారు
ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలి: షేక్షావలి
నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలోని కొణిదెలలో బుధవారం ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి షేక్షావలి మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత రైతు సాధికార సంస్థల సిబ్బందిపై ఉందని సూచించారు. నిమస్త్ర కషాయం, ఘనజీవామృతం తయారుచేసి వాటి ఉపయోగాలను వివరించారు. ప్రతి రైతు పీఎండీఎస్ వేసే విధంగా చూడాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఏఈఓ లక్ష్మీదేవి, పార్వతి, ఎఫ్ఎంటి కరిముల్లా, పరమేష్, శాంతరాజు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్