పగిడ్యాల మండలం నెహ్రూనగర్ సమీపంలోని గోకరాజుకొంట వద్ద శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో చేప పిల్లలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త నల్లమల రవికుమార్, బీజేపీ నాయకులు, మత్స్యశాఖ అధికారులు పాల్గొన్నారు. మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరచడంలో ఈ చర్య కీలకమని రవికుమార్ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మత్స్యకారుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఆయన పేర్కొన్నారు.