డోన్ మండలంలోని చింతలపేట గ్రామంలో శుక్రవారం సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమి పూజ జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి పనులను ప్రారంభించి, గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలో మరిన్ని మౌలిక సదుపాయాల పనులు చేపడతామని, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యమని తెలిపారు.