ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త బోయ రుక్మాంగనాధుడు ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న పాణ్యం నియోజకవర్గ టీడీపీ యువ నాయకుడు గౌరు జనార్దన్ రెడ్డి గురువారం గ్రామానికి చేరుకుని, మృతుడి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద ఘటన కుటుంబానికి తీరని లోటని పేర్కొంటూ, ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు సూచించారు.