నంద్యాలలో పది ఫలితాల్లో బాలికల ఆధిక్యం

7చూసినవారు
నంద్యాలలో పది ఫలితాల్లో బాలికల ఆధిక్యం
నంద్యాల జిల్లాలో పదో తరగతి ఫలితాల్లో బాలికలు మెరుగైన ప్రతిభ కనబర్చారు. మొత్తం 24, 529 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 84. 73 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో బాలికలు 85. 7 శాతం, బాలురు 82. 18 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురతో పోలిస్తే బాలికలే అధిక శాతం సాధించడం విశేషం. రాష్ట్ర స్థాయిలో నంద్యాల జిల్లా 19వ స్థానంలో నిలిచిందని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్