గోస్పాడు మండలం జిల్లెల్ల గ్రామంలో బుధవారం నిర్వహించిన గ్రామసభలో రీసర్వే సమస్యలపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ అధికారులకు పెండింగ్ కేసులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, రీసర్వేలో జాయింట్ ఎల్పీఎంలు పడటం, భూమి కొలతల్లో తేడాలు, భూమి కేటాయింపుల్లో గందరగోళం వంటి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. రైతుల సమస్యలను అధికారులు సానుకూలంగా పరిశీలించి, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.