జీవో 98 నిర్వాసిత నిరుద్యోగుల రిలే నిరాహార దీక్షలు 42వ రోజుకు

3చూసినవారు
జీవో 98 నిర్వాసిత నిరుద్యోగుల రిలే నిరాహార దీక్షలు 42వ రోజుకు
శ్రీశైలం నీటి ముంపు నిర్వాసిత నిరుద్యోగ బాధితులు (జీవో 98) నందికొట్కూరు పట్టణంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నేటికి 42వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా జయన్న మాట్లాడుతూ, పట్టణ నడిబొడ్డున కేజీ రహదారిపై దీక్షలు చేస్తున్న తమను చూసి చూడనట్లు వ్యవహరించడం సరికాదని, ఇప్పటికైనా అధికారులు తమను పిలిపించి, చర్చలు జరిపి, జీవో 98 సమస్యలు పరిష్కరించి, ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలలో నాగేంద్రుడు, జమ్మన్న, హుశేనాలo, శ్రీను, నారాయణ రామకృష్ణ, కురుమన్న వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్