
హైదరాబాద్‌లో ఏఆర్ రెహమాన్ లైవ్ కాన్సర్ట్
సంగీత ప్రియులకు గుడ్ న్యూస్. ఆస్కార్ అవార్డ్ గ్రహీత, సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ హైదరాబాద్ ప్రజలకు ప్రత్యేక మ్యూజిక్ అనుభూతిని అందించనున్నారు. హైదరాబాద్ టాకీస్ ఆధ్వర్యంలో నవంబర్ 8న రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ లైవ్ కాన్సర్ట్ నిర్వహిస్తుంది. ఇందులో రెహమాన్ తన సూపర్‌హిట్ పాటలతో ప్రత్యక్షంగా ఆలపించనున్నారు. దీంతో అభిమానులు ఈ కార్యక్రమం కోసం ఎదురుచూస్తున్నారు.




