వైఎస్సార్ విగ్రహ ధ్వంసంపై ఎమ్మెల్సీ ఇసాక్ బాషా ఆగ్రహం

14చూసినవారు
నంద్యాలలో వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై ఎమ్మెల్సీ ఇసాక్ భాష తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల హృదయాల్లో నిలిచిన నాయకుడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఖండనీయమని, రద్దీ ప్రాంతంలో ఘటన జరుగుతుంటే పోలీసులు వెంటనే స్పందించకపోవడంపై ఆయన ప్రశ్నించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై వైయస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్