దిత్వా తుఫాను ప్రభావంతో కొత్తపల్లి మండలంలోని గువ్వలకుంట్లలో సోమవారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. దీనితో వరి, మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులు పంట నష్టంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాగు భూముల్లో నీటి నిల్వ పెరిగే అవకాశం ఉండడంతో దిగుబడి తగ్గుతుందేమోనని రైతులు చింతిస్తున్నారు.