లోక్‌సభలో నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి శనివారం రెండు ముఖ్యమైన ప్రైవేటు బిల్లులను ప్రవేశపెట్టేందుకు స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా అనుమతి మంజూరు చేశారు. దేశంలోని ప్రతి జిల్లా కేంద్రంలో కేన్సర్ గుర్తింపు, నివారణ సేవల కోసం సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో వాల్మీకి–బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతూ రాజ్యాంగ సవరణ బిల్లుకు కూడా సభలో ఎటువంటి వ్యతిరేకత లేకుండా స్పీకర్ అనుమతి లభించింది.