నంద్యాల జిల్లా పోలీసు సిబ్బందిలో మానసిక ప్రశాంతత, ఒత్తిడి నివారణ కోసం రామకృష్ణ పీజీ కాలేజ్ ఆడిటోరియంలో హార్ట్ ఫుల్ నెస్ మెడిటేషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ సునీల్ షొరాణ్, ధ్యానం ద్వారా శారీరక, మానసిక ఒత్తిడి తగ్గి సానుకూల దృక్పథం పెరుగుతుందని తెలిపారు. మూడు రోజుల ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పోలీసులకు సూచించారు.