పాణ్యం 27వ వార్డు ఆదర్శ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. టీడీపీ యువ నాయకుడు గౌరు జనార్దన్ రెడ్డి అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.