ఇంధన కొరతపై సీపీఐ నిరసన, ప్రభుత్వంపై ఆగ్రహం

1156చూసినవారు
ఇంధన కొరతపై సీపీఐ నిరసన, ప్రభుత్వంపై ఆగ్రహం
ఆత్మకూరులో సీపీఐ పార్టీ పట్టణ కార్యదర్శి ఏ. రణదీర్ ఆధ్వర్యంలో కార్మికులు, వాహనదారులతో కలిసి ఆదివారం ఇంధన కొరతకు నిరసన తెలిపారు. పెట్రోల్, డీజిల్ కొరత వల్ల ప్రజా రవాణా, నిత్యావసర సరుకుల రవాణా వాహనాలు నిలిచిపోతాయని, దీనివల్ల కార్మికుల ఉపాధి తీవ్రంగా దెబ్బతింటుందని, వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఇంధన కొరతను అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్