
శవాలను బయటకు లాగి బూడిద ఎత్తుకెళ్తున్నారు!
TG: మెదక్ జిల్లా చేగుంట స్మశానంలో కాలిపోతున్న శవాలను చితిలోంచి బయటకు లాగి, అక్కడి బూడిదను ఎత్తుకెళ్తున్నారు. శనివారం ఉదయం సగం కాలిన మృతదేహం చితిలోంచి బయటపడేసి ఉండటం, రెండు రోజుల క్రితం ఓ మహిళ అంత్యక్రియల తర్వాత కూడా చితాభస్మాన్ని ఎత్తుకెళ్లడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. బంగారం కోసమా లేక క్షుద్ర పూజల కోసమా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.




