దేవాదాయశాఖ రాయలసీమ జోన్ డిప్యూటీ కమిషనర్‌గా రామాంజనేయులు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం మద్దిలేటి స్వామి ఆలయంలో ఉప కమిషనర్, ఈఓగా విధులు నిర్వహిస్తున్న ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. డిప్యూటీ కమిషనర్ గురుప్రసాద్ పదవీ విరమణ చేయడంతో ఈ నియామకం చేపట్టినట్లు దేవాదాయశాఖ అధికారులు తెలిపారు. ఈ నియామకం ద్వారా రాయలసీమ జోన్‌లోని దేవాలయాల నిర్వహణలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.