నంద్యాలలో ఆదివారం ఎస్‌డిపిఐ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. జాతీయ కమిటీ సభ్యులు జహీర్ అబ్బాస్, రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్లా ఖాన్ నాయకత్వంలో జరిగిన ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. "మన వార్డు–మన బాధ్యత" కార్యక్రమ పురోగతిని సమీక్షించారు. ప్రజల మధ్య పార్టీ పునాది మరింత బలపడుతోందని నాయకులు తెలిపారు.