జూపాడు బంగ్లాలోని మోడల్ స్కూల్‌లో బుధవారం ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కళాశాల ప్రిన్సిపల్ మందలించడంతో మనస్తాపం చెంది ఈ చర్యకు పాల్పడినట్లు సమాచారం. అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.