నందికొట్కూరులో మొక్కజొన్న రైతుల ఆవేదన

2506చూసినవారు
నందికొట్కూరు ప్రాంతంలోని మొక్కజొన్న రైతులు 10 రోజులుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రం కోసం ఎదురుచూస్తున్నారు. స్పందన లేకపోవడంతో గురువారం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దళారులు క్వింటాల్‌కు రూ. 1,800 మాత్రమే ఆఫర్ చేస్తున్నారని, ఆర్థిక ఇబ్బందుల వల్ల తక్కువ ధరకే పంటను అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు తెలిపారు. రోజూ విత్తనాలు ఆరబెట్టుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తక్షణమే కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్