కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మంగళవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. మహానంది, బండి ఆత్మకూరు, గడివేముల, శిరివెళ్ల, నందికొట్కూరు, కోడుమూరు, ఓర్వకల్ మండలాల్లో కుండపోత వర్షంతో పాటు వడగండ్లు, ఈదురుగాలులు వీచాయి. దీనివల్ల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పలుచోట్ల చెట్లు కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.