నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక”లో ఎస్పీ సునీల్ షొరాణ్ IPS మొత్తం 45 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుపై పూర్తిస్థాయి విచారణ జరిపి చట్ట పరిధిలో సత్వర న్యాయం అందిస్తామని, ఫిర్యాదులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ఓఎల్ఏ స్కూటర్ కొనుగోలు మోసం, ఫైనాన్స్ కార్ ట్రాన్స్‌ఫర్ వివాదం, చౌటుకూరు రహదారి అడ్డంకులపై రైతుల ఫిర్యాదులు ప్రధానంగా నమోదయ్యాయి.