అలగనూరు రిజర్వాయర్ మరమ్మత్తులు: సీపీఐ ఆందోళన

176చూసినవారు
అలగనూరు రిజర్వాయర్ మరమ్మత్తులు: సీపీఐ ఆందోళన
అలగనూరు రిజర్వాయర్ మరమ్మత్తు పనులు తొమ్మిదేళ్లుగా పూర్తికాకపోవడంతో నంద్యాల జిల్లా ప్రజలకు తాగు, సాగు నీరు అందడం లేదని, వెంటనే గండి పూడ్చాలని సీపీఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు సీపీఐ ఆధ్వర్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లా జడ్పీ కార్యాలయాన్ని ముట్టడించి, గేట్లు తోసుకుని లోపలికి దూసుకెళ్లారు. అలగనూరు రిజర్వాయర్ పై దృష్టి పెట్టని మంత్రులు రాజీనామా చేయాలని సీపీఐ నంద్యాల జిల్లా సమితి డిమాండ్ చేసింది.

సంబంధిత పోస్ట్