నంద్యాల జర్నలిస్టుల సమస్యలపై ఏపిజేయు పోరాటం

6చూసినవారు
నంద్యాల జర్నలిస్టుల సమస్యలపై ఏపిజేయు పోరాటం
ఏపిజేయు జిల్లా అధ్యక్షుడు నందవరం శ్రీనివాసులు నంద్యాల జిల్లా జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు. బుధవారం నంద్యాల ఏపిజేయు కార్యాలయంలో కొత్త సభ్యులకు యూనియన్ కార్డులు అందజేశారు. గత ఆరు సంవత్సరాలుగా అక్రిడేషన్‌లపై ప్రభుత్వం ఆంక్షలు పెడుతుండటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లాకు ఇప్పటికీ ప్రెస్ క్లబ్ లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్