నంద్యాల జిల్లా గోస్పాడు మండలం దిబగుంట్ల గ్రామంలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. అనుమానాస్పద ప్రదేశాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, నేర చరిత్ర కలిగిన వ్యక్తుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా, మాదకద్రవ్యాల దుర్వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.