తాళ్లపల్లి వీరయ్య కుటుంబానికి న్యాయం కోరుతూ సిపిఐ ధర్నా

14చూసినవారు
తాళ్లపల్లి వీరయ్య కుటుంబానికి న్యాయం కోరుతూ సిపిఐ ధర్నా
నంద్యాల కలెక్టర్ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు తాళ్లపల్లి వీరయ్య కుటుంబ సభ్యులు సోమవారం భారీ ధర్నా నిర్వహించారు. ఫోర్జరీ సంతకాలతో కుటుంబ ఆస్తులపై అన్యాయంగా నిర్మాణాలు చేస్తున్న బిల్డర్ పబ్బతి వేణు పనులను వెంటనే ఆపాలని వారు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పార్టీ అండగా ఉంటుందని సిపిఐ నాయకులు రామాంజనేయులు, రంగనాయుడు స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్