నంద్యాల జిల్లా కల్లూరు అర్బన్ 31వ వార్డు బద్రీనాథ్ నగర్‌లో బుధవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి నంద్యాల జిల్లా అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, టీడీపీ యువ నాయకుడు గౌరు జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. వారు లబ్ధిదారులకు పింఛన్లు అందజేస్తూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు.