యాళ్లూరులో ఎంఎస్‌ఎంఈ పార్కుకు శంకుస్థాపన

1చూసినవారు
యాళ్లూరులో ఎంఎస్‌ఎంఈ పార్కుకు శంకుస్థాపన
గోస్పాడు మండలం యాళ్లూరులో రూ. 16.40 కోట్లతో నిర్మించనున్న ఎంఎస్‌ఎంఈ పార్కుకు మంత్రి ఎన్ఎండి ఫరూక్, కలెక్టర్ రాజకుమారి గణియా శంకుస్థాపన చేశారు. "ఒక నియోజకవర్గానికి ఒక ఎంఎస్‌ఎంఈ పార్కు" పథకంలో భాగంగా ఈ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. ఇది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు గ్రామీణ పారిశ్రామికాభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్