కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి కేజే జార్జ్ ఓర్వకల్లులోని గ్రీన్ కో పవర్ ప్రాజెక్టును సందర్శించి, పునరుత్పాదక ఇంధన రంగంలో దేశానికే ఆదర్శమని ప్రశంసించారు. సౌర విద్యుత్ ఉత్పత్తి పెరుగుతున్నా నిల్వ వ్యవస్థల లోటు సమస్యగా ఉందని, పంప్ స్టోరేజీ సాంకేతికతతో నిరంతర సరఫరా సాధ్యమని తెలిపారు. కర్ణాటకలో 3వేల మెగావాట్ల సామర్థ్యంతో ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.