విజయనగరంలో జరిగిన రాష్ట్రస్థాయి పారా బ్యాడ్మింటన్ పోటీలలో హిమ గణేష్ విజేతగా నిలిచారు. ఈ నెల 6, 7 తేదీలలో హైదరాబాద్లో జరిగే జాతీయ స్థాయి పోటీలలో ఆంధ్రప్రదేశ్ జట్టు తరపున పాల్గొననున్నారు. బనగానపల్లెలో వెటర్నరీ అసిస్టెంట్గా పనిచేస్తున్న గణేష్‌ను నంద్యాల జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డా. రవికృష్ణ, కార్యదర్శి రమణయ్య అభినందించారు.