నంద్యాలలో కార్తీక వనభోజన మహోత్సవాలు: సగర వివాహ పరిచయ వేదిక ప్రధాన ఉద్దేశ్యం

2చూసినవారు
నంద్యాల పట్టణంలో నవంబర్ 2వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు చామకాలువ దగ్గర "శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి కళ్యాణ మండపంలో" కార్తీక మాస వనభోజన మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు ఇమ్మడి అనిల్ రామయ్య తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రెండవసారి నిర్వహిస్తున్న ఈ మహోత్సవాల ప్రధాన ఉద్దేశ్యం సగర వివాహ పరిచయ వేదిక అని, ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో సగరులు హాజరై జయప్రదం చేయాలని ఆయన కోరారు. ప్రార్థన గీతంతో మొదలై వనభోజన కార్యక్రమంతో ముగుస్తుంది.