
నేటి నుంచి బ్యాంకింగ్, UPI నిబంధనలలో మార్పు
మార్చి 1వ తేదీ నుంచి పలు ముఖ్యమైన మార్పులు అమలులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో UPI లావాదేవీలకు సంబంధించి, పెద్ద మొత్తంలో జరిగే ట్రాన్సాక్షన్లకు పిన్‌తో పాటు బయోమెట్రిక్ లేదా మల్టీ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ తప్పనిసరి చేయాలని భావించారు. అలాగే, కొన్ని ప్రభుత్వ బ్యాంకులు కనీస నిల్వ (Minimum Balance) నిర్వహించని ఖాతాలపై విధించే జరిమానా నిబంధనలను మార్చాయి. ఈ మార్పులు ఖాతాదారులకు కొంత ఉపశమనాన్ని అందించనున్నాయి.




