ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుఫాన్ వల్ల జరిగిన భారీ నష్టానికి తక్షణమే బాధితులను ఆదుకోవాలని మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలో కేంద్ర మంత్రులు అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహన్‌లను కోరారు. పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీలతో సమావేశమైన అనంతరం ఈ భేటీ జరిగింది. రాష్ట్రానికి అత్యవసర సహాయం అవసరమని లోకేశ్ వివరించారు. నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఈ విషయాన్ని వెల్లడించారు.