
మహిళా రోగికి మత్తు మందులు ఇచ్చి ఎఫైర్ పెట్టుకున్న వైద్యుడు
యూకేలో భారత సంతతికి చెందిన న్యూరో సర్జన్ డాక్టర్ చిరాగ్ పటేల్‌పై మెడికల్ ప్రాక్టీషనర్స్ ట్రైబ్యునల్ 8 నెలల సస్పెన్షన్ విధించింది. మహిళా రోగితో ఎఫైర్ పెట్టుకోవడం, నిబంధనలకు విరుద్ధంగా మత్తు మందులు సూచించడం వంటి ఆరోపణలు రుజువయ్యాయి. 2019లో శస్త్రచికిత్స అనంతరం రోగితో వ్యక్తిగత సంబంధం, అశ్లీల చిత్రాలు పంపడం, 2022-23 మధ్య వైద్య రికార్డులు లేకుండా మత్తు మందులు సూచించడం వంటివి విచారణలో తేలాయి. కుటుంబ సమస్యలు, బ్లాక్మెయిల్ ఆరోపణలు చేసినా, రోగి భద్రతను విస్మరించారని ట్రైబ్యునల్ పేర్కొంది.




