నంద్యాలలో ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీని అరికట్టడంలో జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి విఫలమయ్యారని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎర్రి స్వామి ఆరోపించారు. ప్రైవేట్ యాజమాన్యాల నుంచి ముడుపులు తీసుకుని పాఠశాలలపై చర్యలు తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు. అధికారులు వెంటనే స్పందించి ఫీజుల నియంత్రణపై చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.