నంద్యాలలో టెక్కే మార్కెట్ యార్డ్ నుంచి గాంధీ చౌక్ వరకు నిర్వహించిన 5కే రన్ను కలెక్టర్ రాజకుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా జనగణన ప్రతి పౌరుడి బాధ్యత అని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులు, మహిళలు, యువత ఉత్సాహంగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో, జనగణనకు అందరూ సహకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ 5కే పరుగులో యువత, మహిళలు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.