69వ జాతీయ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఫెన్సింగ్ పోటీల్లో నంద్యాలకు చెందిన పబ్బతి చిన్మయి శ్రేయ అండర్-17 బాలికల విభాగంలో మూడో స్థానం సాధించి ఆంధ్రప్రదేశ్‌కు తొలి పతకాన్ని అందించింది. మహారాష్ట్రలో జరిగిన ఈ పోటీల్లో పశ్చిమబెంగాల్, గోవా, తెలంగాణ క్రీడాకారిణులపై విజయం సాధించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది.