నంద్యాల: 60 లక్షల వ్యయంతో వన్ స్టాప్ సెంటర్ నిర్మాణ ప్రారంభం

9చూసినవారు
నంద్యాల: 60 లక్షల వ్యయంతో వన్ స్టాప్ సెంటర్ నిర్మాణ ప్రారంభం
నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో రూ. 60 లక్షల వ్యయంతో నిర్మించబడనున్న వన్ స్టాప్ సెంటర్‌కు రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎంపీ బైరెడ్డి శబరి బుధవారం భూమి పూజ చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు. మహిళలకు వైద్య, న్యాయ, పోలీస్ సహాయం, కౌన్సెలింగ్ వంటి సేవలు ఒకే చోట అందించడమే ఈ కేంద్రం లక్ష్యం. మహిళల భద్రత సమాజ ప్రగతికి మూలస్థంభమని ఎంపీ శబరి తెలిపారు.