నంద్యాల: పెంచిన విద్యుత్ సర్దుబాటు చార్జీలను తగ్గించాలి

56చూసినవారు
నంద్యాల: పెంచిన విద్యుత్ సర్దుబాటు చార్జీలను తగ్గించాలి
నంద్యాల సంజీవనగర్ గేట్ లో సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో నిరసన తెలపడం జరిగిందని సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్ ఏఐటియుసి పట్టణ అధ్యక్ష కార్యదర్శులు భూమని శ్రీనివాసులు శనివారం తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారం ప్రభుత్వం చేపట్టిన ఏడాది కాలంలోనే విద్యుత్ సర్దుబాటు చార్జీల పేరుతో 15 , 485 కోట్ల భారం ప్రజలపై మోపింది. అంతేకాక గృహాలకు స్మార్ట్ మీటర్లు బిగించేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదన్నారు.

సంబంధిత పోస్ట్