నంద్యాల జిల్లా డోన్ టౌన్ పోలీసులు, సీసీఎస్ నంద్యాల పోలీసులు సంయుక్తంగా ఐటీసీ సిగరెట్ గోదాం చోరీ కేసును ఛేదించి, అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపీఎస్ తెలిపిన వివరాల మేరకు, రాజస్థాన్‌కు చెందిన నిందితుల వద్ద నుంచి రూ. 14,01,500 నగదు, ఒక మారుతి సుజుకి స్విఫ్ట్ కారు, 45 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. డోన్ టౌన్ ఇన్స్పెక్టర్ జి. ఇంతియాజ్ బాషా, సీసీఎస్ ఇన్స్పెక్టర్ పి. సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కేసును ఛేదించారు.