నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం మద్దూరు సమీపంలో శనివారం తెల్లవారుజామున చెన్నై నుంచి కర్నూలుకు వెళ్తున్న PRL ట్రావెల్స్ బస్సును రాంగ్ రూట్లో వచ్చిన లారీ ఢీకొంది. బస్సు డ్రైవర్ ప్రకాశ్ రెడ్డి (28) అప్రమత్తతతో వ్యవహరించడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అయితే, డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.