నంద్యాల జిల్లా పాణ్యం మండలంలోని బలపనూరు గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ సమావేశంలో నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్ గురువారం పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ. విద్యార్థుల సమగ్ర అభివృద్ధిలో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. బడికి వెళ్లేలా పిల్లలను ప్రోత్సహించడమే కాకుండా వారి నైతిక, మానసిక వికాసానికీ తోడ్పడాలని సూచించారు.